Little Hearts | సాధారణంగా థియేటర్లలో విజయం సాధించిన సినిమాలు ఓటీటీలోకి వచ్చిన అనంతరం రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తుంది రీసెంట్గా సూపర్ హిట్ అయిన ‘లిటిల్ హార్ట్స్ చిత్రం. థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం.. ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్లు ఇది క్రింజ్ కామెడీ (Cringe Comedy) అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ చిత్రం థియేట్రికల్ రన్లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు కామెడీ సినిమాల్లో ఒక పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చాక కూడా
దూసుకుపోతుంది అనుకున్నారు మేకర్స్. కానీ OTT ప్లాట్‌ఫామ్ ETV Winలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై విమర్శలు పెరుగుతున్నాయి. చాలా మంది నెటిజన్లు థియేటర్స్‌లో ఓవర్రేటెడ్, కానీ అసలైన క్రింజ్ కామెడీ అంటూ పోస్టులు చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలో సామూహికంగా నవ్వుతూ చూసినప్పుడు వేరుగా అనిపించే కామెడీ ఇంటి వాతావరణంలో ఒంటరిగా చూస్తున్నప్పుడు భిన్నంగా అనిపించడం సహజమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.