జయాపజయాలకు అతీతంగా కెరీర్లో దూసుకుపోతున్నది తెలుగమ్మాయి శ్రీలీల. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఆషికీ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ ఇందులో కథానాయకుడు. ఈ సినిమాలోని శ్రీలీల పాత్ర విషయంలో బీ టౌన్లో ఓ రూమర్ మొదలైంది. వివరాల్లోకెళ్తే. రీసెంట్గా విడుదలైన ‘సైయారా’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఆల్జిమర్ వ్యాధితో బాధపడుతుంటుంది. అక్కడ్నుంచే కథ మలుపు తిరుగుతుంది.
ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న ‘ఆషికీ 3’ కథ కూడా దాదాపు ఈ తరహాలోనే సాగుతుందనేది ఆ రూమర్ సారాంశం. దీనిపై ఇటీవల శ్రీలీల స్పందించింది. “సైయారా’కూ మా సినిమాకూ ఏ సంబంధమూ లేదు. కథానుగుణంగా ఇందులో నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అవన్నీ రూమర్లు. నమ్మకండి’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీలీల. ఆమె కథానాయికగా తెలుగులో నటించిన ‘మాస్ జాతర’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.