A.R.Rehaman | హీరో, దర్శకుడు కాకుండా కేవలం మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసి థియేటర్లకు వెళ్లారంటే ఆ ఘనత ఏ.ఆర్ రెహమాన్‌దే. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు ఆయన సంగీత ప్రవాహంలో కొట్టుకు పోయిన శ్రోతలెందరో. కేవలం ఆయన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసమే థియేటర్లకు ఎందరో ప్రేక్షకులు వెళ్లారనేది జగమెరిగిన సత్యం. ఎన్నో సినిమాలకు తన పాటలతో ప్రాణం పోశాడు. ఇక రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ చేస్తున్నాడంటే సంగీత ప్రియులకు అదొక పండుగే. అయితే తాజాగా జరిగిన ఓ కాన్సెర్ట్ మాత్రం రెహమాన్ అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
మురుక్కమ్ నెంజన్ అనే పేరుతో స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ చెన్నైలో ఓ సంగీత కచేరిని ఏర్పాటు చేశాడు. మాములుగానే ఆయన కచేరి ఎక్కడ పెట్టిన జనాలు లక్షల్లో వస్తుంటారు. అలాంటిది తన స్వస్థలం చెన్నైలో కచేరి అంటే ఏ రేంజ్లో సంగీత ప్రియులు వస్తారనేది ఊహించడం కష్టం. ప్రముఖ ఆర్గనైజర్ కంపెనీ ఏవీటీసి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. కాగా ప్రమోషన్లు భారీగా జరపడంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆదివారం పాక్-ఇండియా మ్యాచ్ ఉన్నా సరే.. దానిని లెక్క చేయకుండా వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేశారు.
అయితే టిక్కెట్లు కొన్నవాళ్లలో చాలా మందికి అక్కడ సీట్లు లేకపోవడం గమనార్హం. అంటే సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు అమ్మారు. దాంతో కాన్సర్ట్ చూడడానికి వచ్చిన వందలాది ఫ్యాన్స్ కూర్చోడానికి సీట్లు కూడా లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వేలకు వేలు ఖర్చుపెట్టుకుని వస్తే ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆర్గనైజైషన్పై మండిపడ్డారు. పోని లోపల ఉన్న వాళ్లయినా కాన్సర్ట్‌ను ఎంజాయ్ చేశారా అంటే అదీ లేదు. సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం.. వెనకాల కూర్చున్న వారికి అసలు పాటలే వినిపించక పోవడం వంటివి జరిగాయి. ఆ పరిణామాలు ఎంతదాకా వచ్చాయంటే కాన్సర్ట్‌ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.
ప్రస్తుతం తమిళ నాట ఇదే టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. వందలాది రెహమాన్ ఫ్యాన్స్ ఓపెన్‌గానే ఈ కాన్సర్ట్‌పై కోపంతో రగిలిపోతున్నారు. ఎన్నో లైవ్ కాన్సెర్ట్‌లకు వెళ్లాం కానీ.. ఇలాంటి సంఘటనలు మాత్రం జరగడం ఇదే తొలిసారని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా స్కామ్2023 అని ట్విట్టర్లో పెద్ద మొత్తంలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకు చెన్నై పనియుర్ ప్రాంతంలో ఉన్న ఆదిత్యరామ్ పాలస్‌లో జరిగింది. 50వేల మందికి సరిపడా వసతులు కల్పించడంలో ఏవీటీసి ఆర్గనైజర్స్ పూర్తిగా విఫలం అయింది.
It was worst concert ever in the History #ARRahman #Scam2023 by #ACTC. Respect Humanity. 30 Years of the Fan in me died today Mr. #ARRAHMAN. #MarakkumaNenjam Marakkavey Mudiyathu, . A performer in the stage can’t never see what’s happening at other areas just watch it. pic.twitter.com/AkDqrlNrLD
— Navaneeth Nagarajan (@NavzTweet) September 10, 2023