Ramayana | బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘రామాయణ’(Ramayana). దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపోందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ నటుడు యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దంగల్ సినిమా దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. కన్నడ స్టార్ నటుడు యష్ రావణుడి పాత్రలో నటించబోతున్నాడు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించబోతున్నాడు. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఆస్కార్ దిగ్గజాలు, ప్రముఖ సంగీత దర్శకులు A.R. రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రామాయణం సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం భారతీయ వాయిద్యాలలో పురాతనమైన రుద్ర వీణను రెహమాన్ ఉపయోగించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలుబడలేదు.