వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కాస్త సస్పెన్స్‌ను జోడించి తనదైన శైలి వినోదంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
ఈ సినిమాలో నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, కథాగమనంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలో నారా రోహిత్ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలిసింది. గత ఏడాది ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు నారా రోహిత్. తాజాగా భారీ అంచనాలున్న ‘ఆదర్శ కుటుంబం’లో ఆయన ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.