‘సినీరంగంలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఒక సినిమా తీసి హిట్ కొడదామంటే కుదరదు. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి కథలతో సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం’ అన్నారు విజయ్‌పాల్ రెడ్డి అడిదల. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ఆయన నిర్మించిన ‘బ్యూటీ’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి మాట్లాడుతూ “బ్యూటీ’ సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. ప్రచార చిత్రాలకు కూడా మంచి స్పందన లభించింది.
ఈ సినిమాలో అందమైన ప్రేమకథతో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులకు కూడా ఈ సినిమాలో చర్చించిన అంశం బాగా నచ్చుతుంది. దాదాపు 150 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది చూశారు. కొందరైతే ‘బేబీ’ ‘కోర్ట్’ ైస్టెల్లో ఉందని మెచ్చుకున్నారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.