కెరీర్లో గుర్తుండిపోయే సినిమా
ఆది సాయికుమార్, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడు. ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. యువ హీరోలు రానా, నాగశౌర్య, సందీప్‌కిషన్, విశ్వక్సేన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్ర టీజర్‌ను చిరంజీవి విడుదల చేయడం టీమ్ అందరికి ఉత్సాహాన్నిచ్చింది. పవన్‌కల్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాకు మంచి హైప్ ఇచ్చారు. ఆది ఇందులో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు’ అన్నారు. ‘దర్శకుడు కథ చెప్పినప్పుడే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సంగీత దర్శకుడు అరుణ్ నా కెరీర్లోనే ఉత్తమ పాటలిచ్చారు. చంద్రబోస్ రాసిన పాటకు అద్భుత ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. నా సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని హీరో ఆది తెలిపారు. నిర్మాత సోదరుడు అశోక్‌కుమార్ మాట్లాడు తూ ‘టీమ్ అందరి సమిష్టి కృషితో సినిమా అద్భుతం గా వచ్చింది. ఈ సినిమా కోసం ఆది సాయికుమార్ ఎంతగానో కష్టపడ్డారు. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించే చిత్రమవుతుంది’ అని పేర్కొన్నారు. కథానుగుణంగా ఆరు పాటలు అద్భుతంగా కుదిరాయని సంగీత దర్శకుడు అరుణ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Adi Saikumar
- Shashi
- Surabhi
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుదాఘాతంతో రాజస్థాన్‌లో 8 మంది మృతి
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

