నితిన్ నటిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మొదలైంది. నితిన్, శ్రీలీలపై డ్యూయెట్‌ని షూట్ చేస్తున్నారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను జీవి ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మెల్బోర్న్లోని అద్బుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నామని, నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ పాటతో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌తో సహా ప్రధాన తారాగణంతో కూడిన ముఖ్యమైన టాకీ పార్ట్‌ని కూడా అక్కడే చిత్రీకరిస్తారు. డా.రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్.