Jailer Success | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ (jailer). తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక ‘జైలర్’ విజయంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ (Kalanithi Maran) నిన్న రజనీకాంత్‌ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్‌తో పాటు లాభాలు కూడా రావడంతో అందులో కొంత భాగాన్ని చెక్ రూపంలో రజనీకాంత్ కు ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ (Sun Pictures) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చెక్‌తో పాటు కళానిధి మారన్ రజనీకి కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాదాపు రూ.1.24 కోట్ల విలువచేసే బ్లాక్ కలర్ BMW X7 సిరీస్ కారును కళానిధి మారన్ బహుమతిగా ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A brand new BMW X7 priced at ₹1.24 cr for superstar #Rajinikanth.
REAL success looks really like this.
||#Jailer | #600CrJailer|| pic.twitter.com/Kt37zsEIdh
— Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2023
BREAKING:
Kalanithi Maran gifts BMW X7 to superstar #Rajinikanth for the historic #Jailer success.pic.twitter.com/8IDGmFo2KV
||#600CrJailer||
— Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2023
ఇదిలా ఉండగా.. జైలర్ సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. సౌత్‌లోని అన్ని రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన తొలి నాన్-సీక్వెల్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటికే తెలుగులో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన డబ్బింగ్ సినిమా చరిత్ర సృష్టించగా.. కర్ణాటకలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా కన్నడ సినిమాలను కూడా దాటేసి టాప్ ప్లేస్‌లో నిల్చుంది. హిందీ మార్కెట్లోనే కాస్త డల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ.. మిగితా అన్ని భాషల్లో జైలర్ విధ్వంసమే కొనసాగుతుంది.