స్వాతి వారపత్రిక ఓనర్ వేమూరి బలరాం జీవిత కథతో ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రభాకర్ జైనీ. ఈ చిత్రాన్ని జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్తామని దర్శకుడు తెలిపారు.
ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…‘బలరాం గారిని గతంలో కలిసిన సందర్భంలో ఆయన తన జీవిత విశేషాలు చెప్పారు. ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు వివరించారు. అవి నాకెంతో ఆసక్తికరంగా అనిపించాయి. అప్పుడే బయోపిక్ కోసం ఆయన అనుమతి తీసుకున్నాను. నలభై ఏండ్లుగా స్వాతి వారపత్రికను యువతీ యువకులు చదువుతున్నారు. అన్ని అంశాలను కలిపి వారపత్రికను అందించారు బలరాం. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సెట్స్ మీదకు తీసుకువెళ్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : తిరుపతి రెడ్డి, సంగీతం : శ్రీధర్ ఆత్రేయ