Actor Shivaji | టాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ (Shivaji) నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 90’స్. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ సతీమణిగా నటించనుంది. ప్రముఖ యూట్యూబర్ మౌలి శివాజీ కొడుకుగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడి పాత్రలో శివాజీ ఇందులో కనిపించనుండగా.. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమోఘా ఆర్ట్స్, ఎంఎన్వో ప్రొడక్షన్స్ బ్యానర్లపైనవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బలి సంగీతం అందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ETV Win లో జనవరి 5న ప్రీమియర్ కానుంది.
#90’s – A Middle Class Biopic , Trailer out now.
Travel with Mr.Shekhar and his family for a comforting escape to your 90’s memories.Trailer link ▶️ https://t.co/SXt6Mt0xhZ
Watch #90’s – Amiddle class biopic with your family releasing on Jan 05th 2024 on @etvwin 🙌
Written &… pic.twitter.com/qqXF1JpTOw
— BA Raju’s Team (@baraju_SuperHit) December 30, 2023