ఇద్దరు ఐఏఎస్‌లకు కోర్టుధికరణ నోటీసులు
పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్‌లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆదేశించారు.
- వచ్చే 9న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్‌లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆదేశించారు. కోర్టు ధికరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో జనవరి 9న జరిగే విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఫాం1 నోటీసులు జారీచేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం, కరీంనగర్ రీజియన్ ఎస్ ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావు స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
స్వయంగా హాజరు నుంచి మినహాయింపు కోరేందుకు ఏవిధమైన అభ్యర్థనలు చేయవద్దని స్పష్టంచేశారు. సివిల్ పనులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ కే ఆనంద్ అండ్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎల్ పాండు వాదిస్తూ, అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పారు. బాధ్యులైన అధికారులపై కోర్టు ధికరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గత విచారణకు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, కరీంనగర్ జిల్లా ఎస్ఈ, పంచాయతీరాజ్ ఇంజినీర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హాజరై కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసింది. ఎందుకు కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదని ప్రశ్నించింది. అధికారులు పలుమార్లు విచారణకు హాజరైనప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీసింది. అనంతరం విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వచ్చేసిన వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఏకే47’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

