Radheshyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. చిత్రబృందం మార్చి 2 నుంచి ఈ చిత్ర ప్రమోషన్స్ జరుపనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం విడుదలచేసిన పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచుతున్నాయి.తాజాగా ఈ చిత్రానికి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్‌లో 90శాతం టికెట్లు అమ్ముడుపోయాయి.
రాధేశ్యామ్ విడుదలకు ఇంకా 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడవడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఒక సినిమాకు ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-K చిత్ర షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ఆదిపురుష్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీంతో పాటుగా సందీప్‌రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలో సినిమాలను చేయనున్నాడు.