800 The Movie Trailer | కల్పిత కథలతో పాటు నిజ జీవిత కథల నేపథ్యంలో సినిమాలు ఈ మధ్య బాగా తెరకెక్కుతున్నాయి. బయోపిక్ అని కనిపిస్తే చాలు జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా భారతీయులు ఎంతో ఇష్టపడే క్రికెట్ నేపథ్యంలో సినిమా వస్తుందంటే వాళ్లలో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఎన్నో బయోపిక్‌లు తెరకెక్కిన ఎమ్.ఎస్. ధోని సినిమాను కొట్టిన బయోపిక్ రాలేదు. ఇక ఇప్పుడు రాబోతున్న 800 సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుందని ప్రచార చిత్రాలు, టీజర్లు చూస్తే అనిపిస్తుంది. శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకుడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డులకెక్కిన ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా సచిన్ టెండుల్కర్ లాంచ్ చేశాడు. ముత్తయ్య మురళీధరన్ నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలను భావోద్వేగభరితంగా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. శ్రీలంకన్ టీమ్‌లో మురళిధరన్ ఎంపిక కావడానికి ముందు ఆయన పడిన స్ట్రగుల్‌ను, టీమ్‌లోకి వచ్చాక తనను తాను గొప్ప బౌలర్‌గా ఆవిష్కరించుకున్న తీరును ట్రైలర్లో చూపించారు. తన కెరీర్లో వచ్చిన ఒడిదుడుకులను, విమర్శలను బాల్‌తో ఎలా సమాధానం చెప్పాడనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు.
ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తికరంగా సాగింది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టర్ నటిస్తున్నాడు. ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమ నంబియార్ నటిస్తుంది. ఈ సినిమా ఆలిండియా పంపిణీ హక్కులు నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో సరైన డేట్ చూసి ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.