భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నుంచి వస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. ఇందులో శుద్ధి అయోధ్యగా ‘మ్యాడ్’ఫేం అనంతిక సునీల్ కుమార్ లీడ్‌రోల్ చేస్తున్నది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ని విడుదల చేశారు.
మార్చి 3న సినిమాలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. ‘అందమా.. అందమా..’ అంటూ సాగే ఈ పాటను వనమాలి రాయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచి, అవని మల్హర్‌తో కలిసి ఆలపించారు. ఈ పాట అనౌన్స్మెంట్ పోస్టర్లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బావుంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్.