7G Brindavan Colony | రెండు దశాబ్దాల క్రితం హృద్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పించింది ‘7జీ బృందావన కాలనీ’. దీనికి సీక్వెల్‌గా ‘7జీ బృందావన కాలనీ-2’ తెరకెక్కుతున్నది. ఏ.ఎం.రత్నం నిర్మాత. సెల్వరాఘవన్ దర్శకుడు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తొలిభాగంలో తన నటనతో ఆకట్టుకున్న హీరో రవికృష్ణ సీక్వెల్లో మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారని, ఆయన సరసన అనశ్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నదని మేకర్స్ తెలిపారు.
బుధవారం నూతన ఏడాదిని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నేటి యువతరం అభిరుచులకు తగ్గట్టుగా సీక్వెల్‌ను రూపొందిస్తున్నామని, అప్పటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తామనే నమ్మకం ఉందని నిర్మాత ఏ.ఎం.రత్నం తెలిపారు. జయరామ్, సుమన్‌శెట్టి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సాహిత్యాన్నందిస్తున్నారు.