Game Changer | తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమాలంటేనే భారీ బడ్జెట్‌తో ఉంటాయి. స్టంట్స్‌కే కాదు సినిమాలో వచ్చే పాటల కోసం కూడా డబ్బులను కోట్లల ఖర్చు చేస్తుంటాడు శంకర్. అయితే శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇండియన్ 2 వంటి డిజాస్టార్ తర్వాత ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే ఈ సినిమాకు పాటలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను పంచుకుంది చిత్రబృందం. ఈ సినిమాలో కేవలం పాటల కోసమే రూ. 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు వెల్లడించాడు.
జరగండి జరగండి
ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి (Jaragandi) సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా.. 600 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గోన్నట్లు తెలిపింది. 13 రోజుల పాటు షూటింగ్ చేసిన ఈ సాంగ్‌లో. 70 అడుగుల ఎత్తయిన కొండ, విలేజ్ సెట్, అందుకు తగిన కాస్ట్యూమ్స్, అన్నింటినీ పర్యావరణహితమైన జనపనారతో తయారు చేసినట్లు ప్రకటించింది.
రా మచ్చా మచ్చా
సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా పాట కోసం 1000 మందికిపైగా జానపద కళాకారులు నృత్యం చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచర్య కొరియోగ్రఫీలో వచ్చిన ఈ సాంగ్‌లో దేశంలోని వివిధ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన గుస్సాడీ (ఆదిలాబాద్), చావ్ (పశ్చిమ బెంగాల్), ఘూమ్రా (ఒడిశా-మట్టిల్కల), తప్పెటగుళ్లు- (విజయనగరం), దురావా-(ఒడిశా) తదితర నృత్య కళలు ఇందులో కనిపించబోతున్నాయి.
‘నానా హైరానా’
ఇండియన్ సినిమాలో ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన మొదటి చిత్రంగా గేమ్ ఛేంజర్ నిలిచింది. ఈ మూవీలోని ‘నానా హైరానా’ అనే సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాను వాడినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌లో ఈ పాట షూటింగ్ జరుపుకోగా.. వెస్ట్రన్ & ఇండియన్ మ్యూజిక్‌తో ఈ సాంగ్ ఉండబోతుందని సమాచారం.
దోప్ సాంగ్
అమెరికాలో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో దోప్ సాంగ్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటను కోవిడ్ సెకండ్ వేవ్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ పాట కోసం రష్యాకు చెందిన 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మరీ షూటింగ్ జరిపారు. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 8 రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.
అయితే ఈ నాలుగు పాటలే కాకుండా ఐదో పాట కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పాటను వెండితెరపై విడుదల చేయనున్నట్లు టాక్.