71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది జాతీయ అవార్డుల ప్రకటించిన విజేతలకు అవార్డులు అందజేస్తున్నారు. మొదటగా నాన్-ఫీచర్ విభాగం కింద విజేతలను ప్రకటించగా.. పలు విజేతలు అవార్డులను అందుకున్నారు.
జాతీయ చలనచిత్ర పురస్కాలు: నాన్-ఫీచర్ విభాగం విజేతలు
ఉత్తమ డాక్యుమెంటరీ (నాన్-ఫీచర్): గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)
ఉత్తమ స్క్రిప్ట్ (నాన్-ఫీచర్): సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
ఉత్తమ వాయిస్ ఓవర్ / నరేషన్: ది స్కేడ్ జాక్ – ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విశెస్ (ఇంగ్లీష్)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ది ఫస్ట్ ఫిల్మ్ ( హిందీ)
ఉత్తమ ఎడిటింగ్ : మూవీంగ్ ఫోకస్ ( ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్ : దుందగిరి కే పూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : లిటిల్ వింగ్స్ ( తమిళం)
ఉత్తమ దర్శకత్వం (నాన్-ఫీచర్): పీయూష్ ఠాకూర్ – ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
స్పెషల్ మెన్షన్స్
నేకల్ – క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మాన్ (మలయాళం) – ఎమ్కే రమదాస్
ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా) – హిమాంశు శేఖర్ కటువా, కదంబినీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
ఉత్పల్ దత్త – ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు (అసామీ)