7 Years For Jersey | న్యాచురల్ స్టార్ నాని నటించిన క్లాసిక్ చిత్రం ‘జెర్సీ’ విడుదలై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్‌లను షేర్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తూచేసుకుంటుంది. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఒక విఫలమైన క్రికెటర్ తన కొడుకు కోసం తిరిగి బ్యాట్ పట్టి ఎలా విజేతగా నిలిచాడనే భావోద్వేగభరితమైన కథతో వచ్చి ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. అర్జున్ పాత్రలో నాని నటన కెరీర్ బెస్ట్ అనిపించగా, అనిరుధ్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఏడేళ్లు గడిచినా ‘అర్జున్’ పాత్ర ఇప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం జాతీయ అవార్డులను కూడా గెలుచుకోవడం విశేషం.
Arjun – A character we continue to relate to, root for and celebrate. 🙌🏻
7 years later, #Jersey still holds a special place in millions of hearts ❤️#7YearsForJersey
Natural Star @NameisNani @anirudhofficial @gowtam19 @ShraddhaSrinath @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/lYhWNfeFF7— Sithara Entertainments (@SitharaEnts) April 19, 2026