7/G Brindavan Colony | దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకొనేది 7/G బృందావన్ కాలనీ (7/G Brindavan Colony). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu) ఫేమ్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) దర్శకత్వం వహించగా.. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) హీరోహీరోయిన్లుగా నటించారు. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్ కంటే తెలుగులో భారీ హిట్ కొట్టింది. అయితే ఈ ఆల్ టైం సినిమాకు సీక్వెల్ వస్తుందన్న సంగతి తెలిసిందే.
7/G బృందావన కాలనీ 2 అంటూ ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. సీక్వెల్‌కు కుడా సెల్వ రాఘవన్ (Sri raghava) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. కొత్త తారగణంతో సీక్వెల్ తెరకెక్కుతున్కట్లు తెలుస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ టుడే ఫేం ఇవానా (Ivana), శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు టాక్.
#Selvaraghavan‘s 7/G Rainbow Colony 2 First look
A Film by @selvaraghavan
Music by @thisisysr
@AMRathnamOfl @ramji_ragebe1 pic.twitter.com/icccmUEVMT— 4K Cinemas (@4kCinemass) January 1, 2025