రవిప్రకాష్ రెడ్డి, సమీర్దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. బసీర్ ఆలూరి దర్శకుడు. పాల్యం రవిప్రకాష్ రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. లవ్, యాక్షన్ మిస్టరీ కథాంశమిదని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠను పంచుతుందని అన్నారు.
ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని, యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని నిర్మాత రవిప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆరుగురు మిత్రుల ప్రయాణం నేపథ్యంలో నడిచే కథ ఇదని హీరో సమీర్ దత్త పేర్కొన్నారు.