ప్రతిష్టాత్మక GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ అయిదో ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరుగనున్నాయి. వైభవ్ జ్యూవెలర్స్ ఈ అవార్డ్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ఆదివారం హైదరాబాద్‌లో కర్టన్‌రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యూవెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగార్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
‘ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు. కళాకారులపై మా తండ్రిగారికి ఉన్న అభిమానం కారణంగా ఈ ఈవెంట్ మొదలైంది. దాన్ని అందరి సపోర్ట్‌తో ముందుకు తీసుకెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్‌గా చేస్తాం. దుబాయ్‌లో ఉన్న తెలుగువారితోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈ ఈవెంట్ నిర్వహించనున్నాం. జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం’ అని గామా సీఈవో సౌరబ్ కేసరి తెలిపారు. ఇంకా జ్యూరీ సభ్యులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు, టాలీవుడ్ యువహీరోలు, హీరోయిన్లు కూడా హాజరు కానున్నారు.