Nivetha Thomas | నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న విభిన్నమైన ఫ్యామిలీ డ్రామా ‘35-చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు. ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్టు ఆదివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. ‘ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే సినిమా. ఎంపిక చేసిన కొద్దిమందికి ఈ సినిమాను ప్రదర్శించగా అందరూ పాజిటివ్‌గా స్పందించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి.’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్.