Cinema News | ప్రియదర్శి, నివేతా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న న్యూఏజ్ క్లీన్ ఎంటర్టైనర్ ‘35 – చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నందకిశోర్ దర్శకుడు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘సయ్యారే సయ్యా..’ అంంటూ సాగే ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు. కార్తీక్ ఆలపించారు. స్నేహం గొప్పతనాన్ని తెలిపేలా ఈ పాట సాగిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్.