‘లోక చాప్టర్ వన్ – చంద్ర’ సినిమాతో 300కోట్ల విజయాన్ని అందుకున్నది మలయాళ మందారం కల్యాణి ప్రియదర్శన్. సౌత్‌లో ఈ స్థాయి విజయం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రావడం నిజంగా గొప్ప విషయమే. ఈ సినిమాకు ముందు అరాకొరా విజయాలతో ఉన్న కల్యాణి ప్రియదర్శన్.. ‘లోకా’ విజయంతో సూపర్ హీరోయిన్గా అవతరించింది. ఇందులో భాగంగానే ఆమెకు లభించిన మరో అద్భుత అవకాశం ‘మార్షల్’. కార్తీ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా కల్యాణి ప్రియర్శన్ ఎంపికైంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కానీ హీరోయిన్ని మాత్రం ఎంపిక చేయలేదు.
కారణం.. ఈ కథలో హీరోయిన్‌ది పెక్యులర్ రోల్. అందుకు తగ్గ కథానాయిక కోసం ఇన్నాళ్లూ అన్వేషణ జరిగింది. ‘లోకా’ విడుదలయ్యాక.. వాళ్లకు కల్యాణి ప్రియదర్శన్ దొరికింది. సముద్రం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీ పాత్ర ఎంత కీలకమో, కల్యాణి పాత్ర కూడా అంతే కీలకమట. ఇద్దరి గెటప్పులూ డిఫరెంట్‌గా ఉంటాయట. ఈ సినిమాలో నటిస్తుండటం వట్ల కల్యాణి ప్రియదర్శన్ ఆనందాన్ని వెలిబుచ్చింది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.