శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 17:32:05

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా..'‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా..'‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?

యాంకర్ ప్రదీప్ హీరోగా సుకుమార్ శిష్యుడు మొన్న తెరకెక్కించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. ఇన్నాళ్లకు విడుదల అవుతుండటంతో ప్రదీప్ కూడా సంతోషంగా ఉన్నాడు. దానికితోడు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రదీప్ హీరోగా నిలబడిపోతాడు అని ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 

గతంలో కూడా కొందరు యాంకర్లు హీరోలుగా మారారు. అయితే వాళ్లకు అదృష్టం కలిసి రాలేదు. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. ఈయన సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. దానికి తోడు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. నీలి నీలి ఆకాశం పాట ఏకంగా 300 మిలియన్ మార్క్ అందుకుంది. దానికి తోడు మిగిలిన పాటలు కూడా అద్భుతమైన విజయం సాధించాయి. దాంతో ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని విధంగా జరుగుతుంది. ఈ సినిమాను చూసి గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'‌ ను విడుదల చేస్తున్నాయి. ఇది కూడా అంచనాలు పెంచుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచి బిజినెస్ చేసింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా. ముఖ్యంగా తెలంగాణలో కోటిన్నరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు ఆంధ్రలో 2.1 కోట్లు.. సీడెడ్ హక్కులు 55 లక్షలకు అమ్ముడయ్యాయి. ఏపీ తెలంగాణలో ఈ సినిమా 4.3 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి మరో 30 లక్షల బిజినెస్ చేసింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..‌ప్రదీప్ సినిమా హిట్ కావాలి అంటే 5 కోట్ల షేర్ తీసుకురావాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 5 కోట్ల షేర్ రావడం పెద్ద విషయం కాదు. మరి ఈ టార్గెట్ ప్రదీప్ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo