Achyut Potdar Dies at 91 | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల మరణ వార్తలతో విషాదంలోకి వెళ్లిన భారతీయ చలనచిత్ర పరిశ్రమకి మరో షాక్ తగిలింది. ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు అచ్యుత్ పోట్దార్ (91) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని థానేలో ఉన్న జుపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నటుడిగా ప్రవేశించడానికి ముందు, అచ్యుత్ పోత్దార్ భారత సాయుధ దళాలలో సేవలందించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 125 చిత్రాలలో నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం కెహ్నా క్యా చాహతే హో (ఏం చెప్పాలనుకుంటున్నావు) అనే డైలాగ్ ఈ సినిమాలోనే ఐకానిక్ డైలాగ్గా నిలిచింది. ఇక అచ్యుత్ పోత్దార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.