2023 First week Releases | కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ముందుగా ఊహించిన విధంగానే గతేడాది చివరి వారం చప్పగా సాగింది. బాక్సాఫీస్ మాట అటుంచు.. కనీసం బుకింగ్స్ లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. గతవారం రిలీజైన సినిమాలన్నిటిలో ఒక్క ‘టాప్ గేర్’ తప్ప మరో సినిమా ఇప్పుడు థియేటర్లో లేదు. కాగా ‘ధమాకా’, ’18పేజీస్’ సినిమాలకు గతవారం కాస్త కలిసి వచ్చింది. ధమాకా ఇప్పటికే లాభాల బాట పట్టగా..18 పేజీస్ బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీగుతుంది. ఓటీటీ ప్రియులకు కూడా గతవారం నిరాశే మిగిల్చింది. ‘బటర్‌ఫ్లై’ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కాలేవు. ఇది కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. కాస్తో కూస్తో చెప్పాలంటే అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ వారం విషయానికొస్తే ఎప్పటిలాగానే ఈ ఏడాది మొదటి వారం కూడా ఓటీటీలదే పైచేయి ఉంది. నిజానికి ‘ఒక్కడు’ రీ-రిలీజ్ తప్పితే పేరున్న ఒక్క సినిమా కూడా ఈ వారం థియేటర్లో రిలీజ్ కావడం లేదు. ఇక ఈ వారం థియేటర్,ఓటీటీలలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఈ వారం థియేటర్లో రిలీజయ్యే సినిమాలు:
ఒక్కడు:
మహేష్‌బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన ఒక్కడు 4K ప్రింట్‌తో జనవరి 7న పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కాబోతుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించింది. మణిశర్మ పాటలు ఇప్పటికీ చెవులలో మార్మోగుతూనే ఉంటాయి. దాదాపు రూ.14కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్‌గా రూ.30 కోట్ల షేర్ సాధించి ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాతో పాటు ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, వీర గున్నమ్మ, దోస్తాన్, కింగ్డమ్ ఆఫ్ ది డైనోసర్స్, ఎ జర్నీ టు కాశీ వంటి చిన్న సినిమాలు జనవరి 6న రిలీజ్ కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా:
అన్‌స్టాపబుల్ బాహుబలి పార్ట్-2 ఎపిసోడ్-జనవరి 6
నెట్ ఫ్లిక్స్:
ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్(ఇటాలియన్ వెబ్ సిరీస్) – జనవరి 4
స్టార్ వార్స్ బ్యాండ్ బ్యాచ్ (సీజన్ 2) – జనవరి 4
ఉమెన్ ఆఫ్ ది డెడ్ (సిరీస్) – జనవరి 5
కోపెన్ హాగన్ కౌబాయ్ (డానిష్ సినిమా) – జనవరి 5
ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ (సిరీస్) – జనవరి 6
సోనీ లివ్:
త్రీ సీస్ (తెలుగు సినిమా) – జనవరి 6
సౌదీవెళ్లక్క (మలయాళ సినిమా) – జనవరి 6
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
తాజా ఖబర్ (వెబ్ సిరీస్) – జనవరి 6
జీ5:
ఊంచాయ్ (హిందీ సినిమా) – జనవరి 6
షికాపుర్ (బెంగాలీ సిరీస్) – జనవరి 6
బేబ్ భంగ్డా పౌండే (పంజాబీ మూవీ) – జనవరి 6