తమిళ ఇండస్ట్రీకి కలిసి రాని 2021.. వరుస మరణాలతో షాక్‌లో ఫ్యాన్స్!

2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ రెండు మూడు రోజులకు ఓ మరణవార్త వినాల్సి వస్తుంది. తాజాగా లెజెండరీ సినిమాటోగ్రఫర్, ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మరణించడం అందర్నీ కలచివేస్తుంది. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఈయన మరణించడం నిజంగానే బాధాకరం. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆనంద్ కు చనిపోయే ముందు రోజు రాత్రి గుండెలో కాస్త మంటగా అనిపించడంతో తనే స్వయంగా కార్ నడుపుకుంటూ వెళ్లి దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ చేరిన కొన్ని గంటలకే మరోసారి గుండెపోటు రావడంతో మరణించాడు.
రెండు రోజుల ముందు ప్రముఖ దర్శకుడు తమిర కరోనాతో కన్నుమూసాడు. ఈయన కంటే వారం రోజుల ముందు తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతోనే మరణించాడు. ఈయన మరణం కూడా తమిళ ఇండస్ట్రీకి షాక్. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ అవార్డులు సైతం గెలుచుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్పీ జననాథన్ 2021లోనే అనారోగ్యంతో మరణించారు. ఈయన చివరి సినిమా విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న లాభం ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నపుడే ఆయన మరణించాడు.
కేవలం వీళ్లు మాత్రమే కాదు.. ప్రేమిస్తే సినిమాలో హీరో అవుతాను అంటూ నవ్వించిన కమెడియన్ విరుచగకాంత్ ఉరఫ్ పల్లు బాబు రోడ్డు పక్కన ఆటోలో తినడానికి తిండిలేక చనిపోయాడు. అలాగే అజిత్ హీరోగా నటించిన బిల్లా 2లో నవ్వులు పూయించిన తీపట్టి గణేష్ కూడా 2021లోనే మరణించాడు. 40 సినిమాలకు పైగా నటించిన అనుభవం ఉన్న తమిళ నటుడు తావసి కూడా క్యాన్సర్ తో ఈ మధ్యే కన్నుమూసాడు. తమిళనాట టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఇంద్ర కుమార్ ఫిబ్రవరి 2021లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇలా 2021లో ఇప్పటి వరకు దాదాపు 25 మంది తమిళ సినీ ప్రముఖులు మరణించారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

