‘మహేష్‌భట్, విక్రమ్‌భట్ లాంటి గొప్ప ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేయాలన్నది నా కల. ‘1920’ చిత్రంతో ఆ కోరిక తీరింది. ఇంత త్వరగా ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం’ అంటున్నది అవికాగోర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘1920’. కృష్ణభట్ దర్శకుడు. ఈ నెల 23న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అవికాగోర్ మాట్లాడుతూ ‘నేను హారర్ సినిమాల్ని ఇష్టపడతాను. భయపడుతూనే ‘రాజుగారి గది’ సినిమా చూశా. కానీ ‘1920’ సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి హారర్ సినిమా చేయడం నాకు తొలిసారి. చాలా కొత్త అనుభూతినిచ్చింది. ఈ సినిమా తరువాత నాకు మరిన్ని హారర్ సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను’ అన్నారు.