కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రంలో నందిని పాత్రలో నటిస్తున్న ఆమె పాత్రను పరిచయం చేస్తూ వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌తో కలిసి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లేను సుకుమార్ అందించడం మరో ప్రధాన విశేషం. డిసెంబర్లో చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎడిటర్: నవీన్ నూలి.