హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మ కె శివ నిర్మాత. జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో హన్సిక రక్తమోడుతున్న గాయాలతో సీరియస్గా కనిపిస్తున్నది.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెరకెక్కించిన సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ సినిమా ఇది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నడుస్తుంది. హన్సిక ఇప్పటివరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిదాపు, సంగీతం: సామ్ సీ, దర్శకత్వం: రాజు దుస్సా.