‘100 డేస్ లవ్‌స్టోరీ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. ‘అతి ప్రేమ భయానకం’ అనేది ఉపశీర్షిక. జయ శివసూర్య, నిఖితశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయమిత్ర దర్శకుడు. పురిపండ వి.వెంకటరమణమూర్తిశర్మ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరింగింది.
నిర్మాత సాయివెంకట్ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు గాను, హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. హృదయాలను హత్తుకునే కథ ఇదని, దర్శకునిగా తనకు, హీరోగా జయ శివసూర్యకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని దర్శకుడు విజయమిత్ర నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: శేషు డి.నాయుడు, సంగీతం: తరుణ్ రాణాప్రతాప్.