సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. సిరి.. శ్రీరామ్ చంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. కెప్టెన్‌గా పక్షపాతం చూపించాడని శ్రీరామ్‌ను నామినేట్ చేసింది. అగ్రెసివ్ అవ్వకు అని చెబితే.. తప్పుగా అర్థం చేసుకుందని శ్వేతను సిరి నామినేట్ చేసింది. ఇక రవి.. రవి.. మానస్, సిరిలను నామినేట్ చేశాడు. నా డ్రమ్స్ లో నుండి నీరు తీసినందుకు హర్ట్ అయి నిన్ను నామినేట్ చేస్తున్నా అని మానస్‌తో చెప్పాడు రవి.
ఇక తన తన బిడ్డ మీద ఒట్టేశానని అందరితో చెబుతున్నావ్ అని సిరిని నామినేట్ చేశాడు రవి. జెస్సీ.. శ్రీరామచంద్ర, సన్నీలను నామినేట్ చేశాడు. ప్రియాంక.. లోబో, విశ్వలను నామినేట్ చేసింది. నమ్మకం బ్రేక్ చేశావని నన్ను నామినేట్ చేశావ్.. టాస్క్ చివర్లో నువ్ చేసింది ఏంటి? అని లోబోను నామినేట్ చేసింది. ఇక విశ్వను సైతం అదే కారణంతో నామినేట్ చేసింది. తన చేతుల్లోని బకెట్లను విసిరి బయటపడేయడం తనకు నచ్చలేదని విశ్వను ప్రియాంక నామినేట్ చేసింది.
మానస్.. రవి, లోబోలను నామినేట్ చేశాడు. నమ్మకాన్ని బ్రేక్ చేశావ్ అంటూ లోబోపై మండి పడ్డాడు. ఆనీ మాస్టర్.. విశ్వ, షన్నులను నామినేట్ చేసింది. కిచెన్ గొడవలో జెస్సీ తరుపున అలా రావడం, మాట్లాడటం నచ్చలేదని షన్నుని ఆనీ మాస్టర్ నామినేట్ చేసింది. ముందు ఒకలా వెనకాల ఒకలా ఉండకూదని, అక్కా అని ఇక పిలవకు అంటూ విశ్వకు వార్నింగ్ ఇస్తూ నామినేట్ చేసింది.
శ్రీరామచంద్ర.. సిరి, షన్నులను నామినేట్ చేశాడు. కాజల్.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. షన్ను.. శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. ప్రియ.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. అలా మొత్తానికి ఈ ఆరోవారంలో ఇంటి నుంచి వెళ్లేందుకు షన్ను, ప్రియాంక, లోబో, శ్రీరామ, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు.