Balagam Movie | గత ఏడాది చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’ ( Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం (డెబ్యూ) వహించిన ఈ చిత్రం తెలంగాణ నాడిని పల్లెటూరి ప్రేమలని ప్రతి ఇంట్లో బంధాలని చాలా సహజంగా చూపించి కళ్ళు తెరిపించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని ప్రతి పల్లెటూరిలో ఈ సినిమా ప్రదర్శించారంటే ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బలగం రూ.23 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే నేటితో ఈ మూవీ విడుదలై సంవత్సరం పూర్తైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. బలగంను ఇంత ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా ధన్యవాదాలు అంటూ వేణు రాసుకోచ్చాడు. ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.
1 year of BALAGAM😍
Once again my thanks to everyone who has supported and blessed 🙏@PriyadarshiPN @KavyaKalyanram @DilRajuProdctns @dopvenu @LyricsShyam pic.twitter.com/egLqWLkLuQ
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 3, 2024
బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు న్యాచురల్ స్టార్ నానితో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.