‘ఇందులో నేను చేసిన సరస్వతి పాత్ర చాలా డిఫికల్ట్. ఓ యాక్టర్‌కి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మేకర్స్ కూడా ఆ పాత్రను సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. అందుకే ఎంజాయ్ చేస్తూ నటించా. ఇప్పటివరకూ నేను చేయని జానర్ ఇది. ఇందులో స్టంట్స్ చేశాను. చేజింగులు చేశాను. ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. తెరపై అందరికీ నచ్చుతాననే అనుకుంటున్నా’ అని మృణాళ్ ఠాకూర్ అన్నారు. అడివి శేష్‌కు జోడీగా ఆమె నటించిన పానిండియా యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం మృణాళ్ విలేకరులతో ముచ్చటించింది.
‘ఒక నటిగా ప్రయోగాత్మక పాత్రల్లో నటించడమంటే నాకిష్టం. అలాగే నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఈ పాత్ర ద్వారా వచ్చింది. ఈ కథ విన్నప్పుడు హరి(అడివి శేష్), సరస్వతి(మృణాళ్) ఎందుకు డెకాయిట్స్‌గా మారారు? అనేది చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. ముఖ్యంగా అడివి శేష్ కోసం అంతా థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. అద్భుతంగా నటించారు. అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమాను షూట్ చేశాం. ఏ భాషవారికైనా నచ్చే సినిమా ఇది. ప్రకాశ్‌రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. ఇక దర్శకుడు షానియల్ దగ్గర్నుంచీ సాంకేతికంగా అందరూ అద్భుతంగా పనిచేశారు. కచ్చితంగా ‘డెకాయిట్’ అందరికీ నచ్చుతాడు’ అన్నారు మృణాళ్ఠాకూర్.