అనధికార కంటెంట్‌పై ఫిర్యాదు చేస్తాం
భారీ పానిండియా చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పుడు హీరోల గెటప్‌ని గోప్యంగా ఉంచడం సహజం. సమయం చూసుకొని మేకర్సే ఆ లుక్‌ని విడుదల చేస్తుంటారు. ఇదంతా ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ మేకర్స్ విడుదల చేయకముందే లొకేషన్లో దొంగతనంగా ఫొటోలు తీసి, వాటిని ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం నిజంగా నేరమే.
భారీ పానిండియా చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పుడు హీరోల గెటప్‌ని గోప్యంగా ఉంచడం సహజం. సమయం చూసుకొని మేకర్సే ఆ లుక్‌ని విడుదల చేస్తుంటారు. ఇదంతా ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ మేకర్స్ విడుదల చేయకముందే లొకేషన్లో దొంగతనంగా ఫొటోలు తీసి, వాటిని ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం నిజంగా నేరమే. ‘ఫౌజీ’ సినిమా సెట్ నుంచి ప్రభాస్ ఫొటోలను ఇలాగే కొందరు తుంటరులు లీక్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘మా సెట్ నుంచి లీకైన కొన్ని ఫొటోలను ఆన్లైన్ వేదికగా సర్క్యూలేట్ చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఓ వెండితెర అద్భుతాన్ని మీకందించేందుకు మేం అహరహం కృషి చేస్తున్నాం.
మీ ఎదురు చూపులకు తగిన ఫలితాన్నిస్తాం. కానీ ఈ విధమైన చర్యలు మా పనిపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పనులకు తెగబడుతున్నవారికి ఇదే మా హెచ్చరిక. ఈ అనధికార కంటెంట్‌పై ఫిర్యాదు చేస్తాం. తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం’ అని ‘ఫౌజీ’ చిత్రబృందం హెచ్చరించింది. 1940ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇమాన్వి కథానాయిక. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రధారులు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

