Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త సేవలు ప్రారంభించింది. ఇప్పటికే క్విక్ కామర్స్ ( రంగంలో దూసుకెళ్తున్న జొమాటో .. తన సేవల విస్తరణకు సిద్ధమైంది. తాజాగా డిస్ట్రిక్ట్ (District) అనే పేరుతో కొత్త యాప్ ప్రారంభించింది. దీంతో టికెట్ బుకింగ్, డైనింగ్ సహా పలు రకాల సేవలను యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.
జొమాటో తచ్చిన తాజా డిస్ట్రిక్ట్ (District) యాప్‌లో సినిమా టికెట్ల బుకింగ్, ఈవెంట్ల టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ షోలు, షాపింగ్, డైనింగ్ సేవలు కూడా ఈ యాప్‌లో జత చేసింది. గత ఆగస్టులో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం నుంచి రూ.2,048 కోట్లకు టికెటింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేసిన జొమాటో.. తాజాగా కొత్త సేవలకు తన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది.