న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాబోయే బడ్జెట్లో మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను (ఐటీ) ఊరట లభించే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కొత్త పన్ను విధానంలో ఐటీ రిలీఫ్ చాన్స్ ఉందన్న అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేండ్లుగా పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయని మోదీ సర్కారు.. కొత్త పన్ను విధానాన్నే సవరిస్తున్నది. ఇందులో భాగంగానే ఈసారి జీరో ట్యాక్స్ శ్లాబును పెంచే అవకాశాలున్నట్టు చెప్తున్నారు.
ఇదీ సంగతి..
ఇప్పుడు కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులూ లేవు. రూ.3-7 లక్షల మధ్య ఉంటే 5 శాతం పడుతున్నది. అయితే దీనికీ సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేటున్నది. కానీ దీంతో సంబంధం లేకుండా రూ.4 లేదా 5 లక్షలదాకా ఎలాంటి పన్నులూ ఉండబోవన్న ప్రకటన ఆర్థిక శాఖ నుంచి రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న రూ.3-7 లక్షల శ్లాబును ఆ మేరకు అంటే రూ.4-7 లక్షలు లేదా రూ.5-7 లక్షలకు తగ్గించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్లో ప్రతిపాదించిన ఐటీ మార్పులు
కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను శ్లాబుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో కొన్ని మినహాయింపుల్ని ప్రకటించారు. వాటిలో..