Tax Deduction for EV Car | విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపులు కల్పిస్తున్నది. ఫేమ్-2 కింద ఇస్తున్న సబ్సిడీకి ఇది అదనం. ఒకవేళ మీరు రుణంపై ఎలక్ట్రిక్ కారు కొంటే ఈ డిస్కౌంట్ను పొందొచ్చు. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల రుణంతో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే వారికి.. ఆ రుణంపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు ఇస్తామని 2019 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఆదాయం పన్ను చట్టంలో 80ఈఈబీ సెక్షన్ను కొత్తగా చేర్చింది కూడా. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తుంది.