న్యూఢిల్లీ, ఆగస్టు 14: యోగా గురువు బాబా రాందేవ్నకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.180.35 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిర్వహణ ఖర్చులు అధికంకావడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.262.72 కోట్ల లాభంతో పోలిస్తే 31 శాతం తగ్గింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.7,202 కోట్ల నుంచి రూ.8,912 కోట్లకు ఎగబాకింది. మరోవైపు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి దుర్గ శంకర్ మిశ్రాను నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకున్నది.