Xiaomi SU7 Sedan | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా (Tesla)’కు పోటీగా మరో సంస్థ ‘ఈవీ కారు’ తెస్తోంది. ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) తన తొలి ఎలక్ట్రిక్ కారు గురువారం ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కూపె సెడాన్ మోడల్ ‘ఎస్‌యూ7’.. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు షియోమీ హైపర్ ఓఎస్ (Xiaomi’s Hyper OS) వర్షన్‌తో పని చేస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 800 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. సెంట్రల్ కంట్రోల్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, బీ-పిల్లర్ కెమెరా నుంచి అన్ లాక్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తోంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎస్‌యూ7’ కారును షియోమీ ఆవిష్కరించింది. వివిధ దశల్లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపింది. అయితే భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.
‘వచ్చే 15-20 ఏండ్లు కష్టపడి పని చేస్తే ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం. ఓవరాల్‌గా ఆటోమొబైల్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా కష్ట పడుతున్నది. పొర్చే, టెస్లా సంస్థలతో పోలిస్తే తాము మార్కెట్లో ఆవిష్కరించే ‘ఎస్‌యూ7’ డ్రీం కారు కానున్నది’ అని షియోమీ ఫౌండర్, సీఈఓ లీ జున్ తెలిపారు.

ఎంఐ బ్రాండ్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎస్‌యూ7’ ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్ వేరియంట్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బీఎండబ్ల్యూ ఐ4, బీవైడీ సీల్, టెస్లా మోడల్ 3 కార్లతో పోటీ పడుతుంది. న్యూ మైక్ క్లారెన్స్ స్పూర్తితో షియోమీ ఎస్‌యూ7 కారు ఫ్రంట్ డిజైన్ రూపుదిద్దుకున్నది. మైక్ క్లారెన్స్ 750ఎస్ తరహా ఎస్‌యూ7 హెడ్ లైట్లు స్లిమ్డ్ డౌన్ వర్షన్, స్లిమ్ ర్రామ్, టెయిల్ లైట్స్, లైట్ బార్ కనెక్టింగ్ టూ వర్షన్ ఉంటాయి. హయ్యర్ వేరియంట్లలో యాక్టివ్ రేర్ వింగ్ ఫీచర్ జత చేశారు.
షియోమీ ఎస్‌యూ7 కారు రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తున్నది. రేర్ వీల్ డ్రైవ్ ఎడిషన్ విత్ 220 కిలోవాట్ల మోటార్, 495 కిలోవాట్ల డ్యుయల్ మోటార్ సెటప్ విత్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తున్నది. 220కిలోవాట్ల మోటార్ గరిష్టంగా 295 హెచ్‌పీ విద్యుత్ వెలువరించడంతోపాటు గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 495 కిలోవాట్ల డ్యుయల్ మోటార్ గరిష్టంగా 664 హెచ్‌పీ విద్యుత్ వెలువరించడంతోపాటు గంటకు 265 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.

ఎంట్రీ లెవల్ ఎస్‌యూ7 కారులో లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్పీ), టాప్ వేరియంట్లో లార్జర్ సీఏటీఎల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ ఎంత అన్నది వెల్లడించలేదు. ఎస్‌యూ7 కారులో టూ థీమ్ ఇంటీరియ్ థీమ్స్ ఉంటాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంటట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ ప్లే ఆన్ డాష్ బోర్డ్ ఉంటాయి. ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి, ఫిబ్రవరి నుంచి డెలివరీ చేపట్టనున్నదని తెలుస్తున్నది.