Xiaomi India New Head | చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఇండియా జనరల్ మేనేజర్‌గా అల్విన్ ట్సేను నియమించింది. భారత్‌లో షియోమీ వ్యాపార పద్దతులపై కేంద్రం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సంస్థ అధిపతిని చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మార్చేయడం గమనార్హం. బ్రిటిష్ నేషనల్ అయిన ట్సే ఇంతకుముందు షియోమీ ఇండోనేషియా మాజీ జనరల్ మేనేజర్‌గా పని చేశారు. పలు గ్లోబల్ మార్కెట్లలోకి విస్తరించడానికి సాయ పడ్డారని షియోమీ ఇండియా ట్వీట్లో తెలిపింది.
షియోమీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా అనూజ్‌శర్మ తిరిగి నయిమితులయ్యారు. షియోమీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్‌ను విచారణకు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆదేశించిన రెండు నెలల తర్వాత సంస్థ అధినేతను మార్చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. భారత విదేశీ మారక ద్రవ్యం చట్టాలకు లోబడి వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నట్లు దర్యాప్తు సంస్థల విచారణలో మను కుమార్ జైన్ చెప్పినట్లు సమాచారం.
రాయల్టీ పేమెంట్స్ పేరిట విదేశీ సంస్థలకు చట్ట విరుద్ధంగా షియోమీ చెల్లింపులు జరిపిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కంపెనీ స్థానిక బ్యాంక్ ఖాతాల పుస్తకాలను స్వాధీనం చేసుకుంది. రూ.725 మిలియన్ల డాలర్లు జప్తు చేసింది.