Xiaomi 15 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన షియోమీ 15(Xiaomi 15) సిరీస్ ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో షియోమీ 15 (Xiaomi 15), షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్(Snapdragon 8 Elite) ప్రాసెసర్‌పై నడుస్తాయి. లైకా (Leica) బ్యాక్డ్ రేర్ కెమెరా మాడ్యూల్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32- మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్లు హైపర్ ఓఎస్ 2.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15 (Android 15 with HyperOS 2.0 skin)పై పని చేస్తాయి. షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra)ఫోన్‌ను గత ఫిబ్రవరిలో, షియోమీ 15 ప్రోతోపాటు షియోమీ 15 ఫోన్లను గత అక్టోబర్‌లో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్ 16జీబీ ర్యామ్ విత్ 512జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,09,999 పలుకుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకున్న వారికి ఫ్రీ ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్, రూ.10 వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్‌లో యూఎస్బీ టైప్-సీ కెమెరా గ్రిప్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, డిటాచబుల్ షట్టర్ బటన్ ఉంటాయి.
షియోమీ 15 ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 64,999 లకు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు రూ.5,999 విలువైన ఫ్రీ షియోమీ కేర్ ప్లాన్ బెనిఫిట్లు లభిస్తాయి. రెండు ఫోన్లు కూడా ఈ నెల 19 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 11 నుంచి భారత్ మార్కెట్లో లభిస్తాయి. అమెజాన్, షియోమీ ఇండియా ఈ-స్టోర్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి. షియోమీ 15 (Xiaomi 15) ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ కలర్స్, షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్ సిల్వర్ క్రోమ్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది.
షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్ 6.73- అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ (1,440×3,200 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. షియోమీ షీల్డ్ గ్లాస్ 2.0 ప్రొటెక్షన్‌తో వస్తోందీ ఫోన్. హెచ్డీఆర్10+, డోల్బీ విజన్‌కు డిస్ప్లే మద్దతుగా ఉంటుంది. షియోమీ 15 (Xiaomi 15) ఫోన్ 6.36-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1,200 x 2,670 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. షియోమీ 15 (Xiaomi 15), షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్లు క్వాల్కామ్ ఓక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్లతో పని చేస్తాయి.
షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) లైకా బ్యాక్డ్ క్వాడ్ కెమెరా యూనిట్‌తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ ఎల్వైటీ -900 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 858 టెలిఫోటో కెమెరా విత్ ఓఐఎస్,200-మెగా పిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ ఓఐఎస్ అండ్ అప్టూ 4.3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటాయి.
షియోమీ 15 (Xiaomi 15) ఫోన్ లైకా ట్యూన్డ్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50- మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్ సపోర్ట్, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ ఓఐఎస్ అండ్ అప్టూ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్ 90వాట్ల వైర్డ్, 80వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,410 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. షియోమీ 15 (Xiaomi 15) ఫోన్ 90వాట్ల వైర్డ్, 50 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,240 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఆల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌లో వస్తున్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ 3.2 టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి.