హైదరాబాద్, మే 6: ప్రముఖ మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సెల్ బే.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలలో షియామీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రీమియం మొబైల్ ఫోన్ ప్రారంభ ధర రూ.63,999. ఆరంభ ఆఫర్ కింద రూ.6,000 క్యాష్‌బ్యాక్ ఉంటుందని సంస్థ తెలియజేసింది. 6.73 అంగుళాల స్క్రీన్, 50+50+50 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,4,600 మెగాహెట్జ్ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. 256జీబీ స్టోరేజీలతో 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్ వేరియంట్లు ప్రస్తుతం షోరూంలలో లభిస్తాయని సెల్ బే ఎండీ సోమ నాగరాజు, కంపెనీ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు తెలిపారు. ఈ కార్యక్రమంలో షియామీ తెలంగాణ, ఏపీ జోనల్ బిజినెస్ మేనేజర్ శివేందర్, తెలంగాణ విభాగం అధిపతి సయ్యద్ అన్వర్, మార్కెటింగ్ మేనేజర్ శివకృష్ణ, సెల్ బే సిబ్బంది పాల్గొన్నారు.