Billioneers Wealth | ఏడాదిలో కుబేరుల సంపద 22% పైపైకి ..!
Billioneers Wealth | గతేడాదితో పోలిస్తే ప్రపంచ కుబేరుల సంపద 22% పెరిగింది. 25 సంపన్న కుటుంబాల సంపద 1.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

Billioneers Wealth | గత ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంపన్న కుటుంబాల సంపద 312 బిలియన్ల డాలర్లు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత 25 సంపన్న కుటుంబాల ఆస్తి 1.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది 2020తో పోలిస్తే 22 శాతం ఎక్కువ. నగదు సమృద్ధి చెందడంతోపాటు స్టాక్ మార్కెట్లలో దూకుడు, పన్ను పాలసీల్లో సర్దుబాట్లు తదితర కారణాలతో కుబేరుల సంపద పెరిగింది. అదే సమయంలో కరోనా వల్ల సంపదలో వ్యత్యాసం కూడా పెరిగింది.
రిటైలర్ కం ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్‌లో దాదాపు సగం వాటాలు గల వాల్టాన్స్ ఆఫ్ ఆర్కాన్సాస్ గ్రూప్ నికర సంపద వరుసగా నాలుగో ఏడాది పెంచుకోగలిగింది. ఈ గ్రూప్ నికర సంపద 238.2 బిలియన్ల డాలర్లు. ఇక వాల్టాన్స్ నికర సంపద గత 12 నెలల్లో 23 బిలియన్ల డాలర్లు వృద్ధి చెందింది. వాల్టాన్స్ ఆఫ్ ఆర్కాన్సాస్ కుటుంబానికి చెందిన స్టాక్స్ 600 కోట్ల డాలర్ల మేరకు గత ఫిబ్రవరి నుంచి విక్రయించారు.
ఇక లగ్జరీ గూడ్స్ హెర్మ్స్ ఫ్యామిలీ సంపద 75 శాతం వృద్ధి చెంది 111.6 బిలియన్ల డాలర్లకు చేరింది. కొత్తగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఫ్రాన్స్ డసాల్ట్, న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న కాస్మోటిక్స్ మేకర్ ఎస్టీ లౌడర్ పేర్లు చేరాయి. ఇక ఈ జాబితాలో సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శ్యామ్‌సంగ్ యాజమాన్యం లీస్ ఫ్యామిలీ పేరు కనుమరుగైంది. గతేడాది శ్యామ్‌సంగ్ చైర్మన్ లీకున్ హీ మృతి నేపథ్యంలో ఆ కుటుంబం 11 బిలియన్ల డాలర్ల మేరకు వారసత్వ పన్ను చెల్లించడంతో ఆ కుటుంబ సంపద తగ్గుముఖం పట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- billioneers
- wealth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

