న్యూఢిల్లీ, మార్చి 31: యుద్ధం సెగ కుబేరులను వదలడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత సంపన్నవర్గాలు హాంకాంగ్‌ను వదలడానికి సిద్ధమవుతున్నట్టు ఆసియా బ్లూంబర్గ్ తాజాగా వెల్లడించింది. గతంలో దుబాయి, హాంకాంగ్, సింగపూర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన సూపర్ రిచ్ వర్గాలు..ప్రస్తుతం వీరు పునరాలోచనలో పడ్డారు. వీరు తమ ఆఫీస్‌లను యూరప్‌కు షిఫ్ట్ చేసేయోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. గడిచిన ఏడాదికాలంలో హాంకాంగ్‌ను వదిలిన శ్రీమంతులు 25 శాతం ఎగబాకి 3,384 మందికి చేరుకున్నారని బ్లూంబర్గ్ వెల్లడించింది.
ఉదాహరణకు లండన్‌కు చెందిన ఫ్యామిలీ ఆఫీస్ హెడ్ అన్మోల్ గోయెల్ మాట్లాడుతూ…ఈ ఏడాది యూఏఈలో తమ నూతన కార్యాలయాన్ని తెరువాలనుకున్నప్పటికీ, ప్రస్తుతం గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదావేస్తున్నట్టు చెప్పారు. ఈ వారంలో హాంకాంగ్‌లో జరిగిన వరుస ఘటనలు, ఆసియా ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్ తిరిగి పుంజుకోనున్నట్టు అంచనాలు వెల్లడయ్యాయి. సద్దుమణిగే సూచనలు పెద్దగా కనిపించని యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు దుబాయి, అబుదాబిలకు ప్రత్యామ్నాయాల కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొంది.