Loans For Used Cars | కరోనా మహమ్మారి మన జీవితాల్లో సమూల మార్పులే తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రజా రవాణాకు బదులు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలోని పలు బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేవారికి రుణాలిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువగా 7.25 శాతం వడ్డీపై రుణాలిస్తున్నది.
మూడేండ్ల గడువుతో రూ.5 లక్షల రుణం తీసుకుంటే నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ.. మొత్తం ఎంత వడ్డీ చెల్లించాలన్న విషయం తెలుసుకుందాం. మీ ఆదాయ వనరు.. సిబిల్ స్కోర్‌ను బట్టి మీకు వచ్చే రుణంపై వడ్డీరేటును బ్యాంకులు ఖరారు చేస్తాయి. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకులు ఇచ్చే రుణం.. దానిపై వసూలు చేసే వడ్డీ తెలుసుకుందాం..!
బ్యాంక్———————– వడ్డీ(%) — గరిష్ఠ రుణం– – – – ఈఎంఐ- – – – – మొత్తం వడ్డీ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 —– 75% కారు విలువ – రూ.15,496- – రూ.57,848
కెనరా బ్యాంక్———— – – – 7.35 – – — 75% కారు విలువ – రూ.15,519 – -రూ.58,673
బ్యాంక్ ఆఫ్ ఇండియా- – – – — 7.35 – – — 70% కారు విలువ – రూ.15,519 — రూ.58,673
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – – — 8.30 – – – -70% కారు విలువ – రూ.15,737 — రూ.66,549
ఎస్బీఐ – – – – – – – – – – – – –9.25 – – – 85% కారు విలువ – రూ.15,958 – -రూ.74,492
హెచ్డీఎఫ్సీ – – – – – – – – – – – 11.00 – – – 100% కారు విలువ- రూ.16,369 – రూ.89,297
ఐసీఐసీఐ బ్యాంక్ – – – – – – – – 12.00 — – 80% కారు విలువ – రూ.16,607 – రూ.97,858
సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు దాని గురించి, లేదా సదరు సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా ప్రయాణికుడి దగ్గర నుంచి కారును కొనుగోలు చేస్తే దాని ప్రమాదాల హిస్టరీ తెలుసుకునే అవకాశం లేదు. ఇది భవిష్యత్‌లో ఇబ్బందులకు దారి తీస్తుంది.
ప్రతి రోజూ కారుపై ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. సిటీ పరిధిలో గానీ, సిటీ ఆవల గానీ తక్కువ దూరం ప్రయాణించిన కారును కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్లో తేలిగ్గానే లభిస్తున్నాయి.
పైలట్ తప్పిదం వల్లనే విమానం ప్రమాదం
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్‌తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..