హైదరాబాద్, నవంబర్ 9: దేశంలో అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వహణ సంస్థ వండర్లా హాలీడేస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం రూ.43.9 కోట్ల నుంచి రూ. 69.7 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఉన్న మూడు అమ్యూజ్మెంట్ పార్క్‌లను 4.7 లక్షల మంది సందర్శించారు.