Wipro | దేశీయ ఐటీ దిగ్గజం విప్రో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ ఈ నెలాఖరులో వైదొలగనున్నారు. ఈ సంగతి శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. శుక్రవారం ఆమె ఇచ్చిన రాజీనామా లేఖను కూడా విప్రో వెల్లడించింది. మూడేండ్లుగా స్టెఫానీ ట్రాట్ మన్ పనితీరుపై విప్రో సంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె తన వ్యక్తిగత, వృత్తి పరమైన లక్ష్యాల సాధన కోసం రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
మూడేండ్ల క్రితం యాక్సెంజర్ పీఎల్సీ నుంచి స్టెఫానీ ట్రాట్మన్ విప్రోలో చేరారు. విప్రో డెవలప్మెంట్ పార్టనర్స్ విభాగానికి సారధ్యం వహించిన స్టెఫానీ ట్రాట్మన్.. సంస్థ బ్రాండ్ పట్ల అవగాహన మెరుగు పర్చారు. గ్లోబల్, స్ట్రాటర్జిక్ సర్క్యూట్ టీమ్ ఏర్పాటు చేయడంతో సంస్థ అమ్మకాల కెపాసిటీ డెవలప్ చేశారు.